Monday, March 8, 2010

తెలంగాణా ఉద్యమ గళం

మన ఈ తెలంగాణా సినిమా లో కూడా అన్ని సినిమా లో లానే సినిమా కి ముందు advertisements ఉంటాయి, అదే మన చందన బ్రదర్స్ and vicco termeric లాంటివి అన్నమాట.కాని ఇందులో hero, comedian, villain లాంటివారి పేర్లు మాత్రం సినిమా మొదలవక ముందు name plates లో ఉండవు, ఎందుకంటే దేంట్లో hero, villain, comedian లాంటి వారు అందరు కూడా మన సినిమా లో ఒక్కొక్క సీన్ లో ఒక్కొకరు వస్తుంటారు. ఆ సన్నివేశాలను బట్టి ఒక్కొక్క charactor బయటకోస్తుంది అన్న మాట. సో మన సినిమా లో సినిమా title తప్ప మరేది కనబడదు. ఇక సినిమా లోకేల్తే scene No .1.....

మొదటి scene లో NIIMS, హైదరాబాద్. గేటు బయట ఒక ప్రముఖTV channel reporter, తెలంగాణా ప్రక్రియ ప్రారంబిస్తామని ప్రకటన వెలువడింది అనే వార్త తెలియడం తో తన 11 రోజుల దీక్షని విరమించిన KCR . cameramen సురేష్ తో సుమతి TV9. మొదట్లో ఈ సీన్ చూసి మన KCR ఏంటి 11 రోజుల దీక్ష ఏమిటి దాన్ని విరమించడం ఏంటి అనుకున్నారు. cut చేస్తే hospital bed పైన మన KCR చిక్కి శాల్యమైపోయి వున్నాడు మనిషి నిజంగానే 11 రోజుల దీక్ష చేసినట్టే వున్నాడు. ఆయన బార్య ఆయనకు బత్తాయి పళ్ళ రసాన్ని అందించింది, దాన్ని త్రాగి మల్లి పడుకుండి పోయాడు కూర్చోవడానికి కూడా ఓపిక లేనట్టుగా. అందరిలో ఒకటే ప్రశ్న అసలు 11 రోజుల క్రింద ఏం జరిగింది. వెంటనే screen పైన ఒక message , 15 రోజుల క్రితం...... ఎంతో ఉత్కంటతతో చూడడం మొదలు పెట్టారు ప్రేక్షకులు. ఇక్కడ రాష్ట్ర ప్రజల charactor మాత్రం మారలేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వారు ప్రేక్షకులే....15 రోజుల క్రోతం.... ప్రత్యేక తెలంగాణా కోసం నిరాహార దీక్ష మొదలు పెట్టడానికి కొద్ది రోజుల ముందు మన KCR నిరాహార దీక్ష చేయబోతున్నట్టు media ముఖంగా ప్రకటన ఇచ్చారు. సిని ఫక్కి లో(ఒహ్హ ..! ఇది సినిమా నే కదా ..!) అయన నిరాహార దీక్ష మొదలు పెట్టడానికి ముందే ఆయన్ని అరెస్ట్ చేసి, తెలంగాణా ప్రాబల్యం అంతగా లేని ఖమ్మం (ఎవరైనా ఈ జిల్లా నుండి వున్నా వాళ్ళు వుంటే క్షమించండి... కాని ఇది నిజం.) జిల్లా జైలు కి తరలించారు. ఇక చేసేది లేక అయన అక్కడి నుండే అయన నిరాహార దీక్షని మొదలు పెట్టారు. KCR గురించి ముందే తెలిసిన తెలంగాణా, ఆంధ్ర ప్రేక్షకులు(ప్రజలు) ఇదేదో కొద్ది రోజులు చేసే రాజకీయ హడావిడి అనుకోని serious గ తీసుకోలేదు. అందరు అనుకున్నట్టే KCR 2 రోజులకే ఏదో ఒక పిట్ట కథ చెప్పి దీక్షను విరమించారు.అక్కడ మొదలయింది అసలైన తెలంగాణా ఉద్యమం, అందరు అనుకుంటున్నట్టు KCR దీక్ష చేసినందువల్ల కాదు ఆయన దీక్ష విరమించడం వాళ్ళ మొదలయింది.ఇక అప్పుడు వచ్చారు మన విద్యార్థులు scene లోకి, అర్దాంతరంగా తెలంగాణా ఉద్యమాన్ని నీరు కర్చేసినందుకు KCR కు విరుద్దంగా కొంచెం గట్టిగానే నిరసన ధ్వనులు వినిపించాయి. ఇక మల్లి చేసేది ఏం లేక మన KCR మల్లి దీక్ష మొదలు పెట్టారు(అదేలెండి మొదలు పెట్టించారు). కథ లో ఈ twist తో మన KCR ఒక్కసారి హీరో అయిపోయారు, తెలంగాణా ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇక ఆయన దీక్ష చేసినన్ని రోజులు తెలంగాణా మొత్తం స్థంబించిపోయింది. ఎప్పటి లానే ఈ scene లో ఎక్కువగా నష్టపోయింది మన APSRTC ఏ. ఈ నిరసన జ్వాలల మద్య సరిగ్గా KCR దీక్ష మొదలు పెట్టిన 11 వ రోజున మన తమిళ డైరెక్టర్ (తెలుగు సినిమా లో తమిళ డైరెక్టర్, ప్రస్తుతం వున్నా trend ను అనుసరించే ) చిదంబరం ముందుకు వచ్చి తెలంగాణా రాష్ట్ర ప్రక్రియ ప్రరంబిస్తున్నాం అని ప్రకటన చేసారు. so అల KCR దీక్షనువిరమించారు. అంతవరకు అసలు మన సినిమా లో charector కూడా confirm అవని ఒక కామెడీ villain ఎంట్రీ ఇస్తారు అతనే మన LANCO లఘడపాటి రాజగోపాల్. scnene ..2

అంతవరకు రాజగోపాల్ లో చూడని కోణాన్ని ఈ సినిమా లో మనం చూడొచ్చు. అసలు మన తెలంగాణా వాళ్ళే కాదు అటు సీమంధ్ర ప్రేక్షకులు (ప్రజలకంటే ప్రేక్షకులు అనడానికే ఇష్టపడతాను నేను.) కూడా ఆశ్చర్య పోయేలా మన కమర్షియల్ సినిమా ని ఒక ఆర్ట్ సినిమా స్థాయికి తీసుకెళ్ళారు మన (కాదు కాదు వాళ్ళ) రాజగోపాల్.ఇంత వరకు ఎక్కడున్నాడో... ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియని రాజగోపాల్ అదే మన comedy villain కూడా దీక్ష మొదలు పెట్టాడు. ఐతే ఈయన మన KCR లా కాకుండా దీక్ష ఇలా కూడా చెయ్యొచ్చ అని ప్రేక్షకులు అంత ముక్కున వేలు వేసుకునేలా చేసారు. అసలు అయన getup గురించి చెప్పాలంటే.... ఒక స్వతంత్ర సమర యోదుడి లా భుజాన మన జాతీయ జండా వేసుకొని ఒక కొత్త getup తో మనకు కనబడతారు. అదేదో సినిమా లో చెప్పినట్టు ప్రతి సీన్ ఒక climax లా వుంటది అన్నట్టు, ఈయన దీక్ష చేసిన ప్రతి రోజు ఒక news create చేసేవారు. దీక్ష మొదలు పెట్టక ముందు ఒకరోజు హైదరాబాద్ కి వస్తారు వచ్చి మన LB stadium లో కూర్చుంటారు, కూర్చొని రమ్మనండి ఎవరు వస్తారో... నేను మాట్లాడతా అని అర్ధం లేని scene create చేసారు. తర్వాత విజయవాడ వెళ్లి అక్కడ తన దీక్షని మొదలు పెట్టారు. దీక్ష మొదలు పెట్టిన మొదటి రోజు నుండే అయన ఆరోగ్యం క్షేనిస్తుందని ఆయన్ని హైదరాబాద్ NIIMS hospital కి తరలించాలని లేక పొతే చనిపోతానని, ఇక్కడ doctors తన ఆరోగ్యం గురించి సరిగ్గా పట్టించుకోవడం లేదని మొదలు పెట్టాడు. మన ప్రేక్షకులు మాత్రం ముక్కున వేలు వేసుకొని ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం మొదలు పెట్టారు. ఈయన నిరాహార దీక్ష చేస్తున్నారా లేక comedy చేస్తున్నర అర్ధం అవలేదు సగటు ప్రేక్షకునికి, నిరాహార దీక్ష ఎందుకు చేస్తారు, Multi speciality hospital లో చేరడానికా? లేక వారి demands ని నేరవర్చుకోవడానికా అని వారి అనుమానం. అల చూస్తూ వుండగా.. మన రాజగోపాల్ బాధ పడలేక ఆయన్ని తీసుకెళ్ళి విజయవాడ లో వున్నా Govt hospital కి తరలించారు. దానికి అయన సంతృప్తి చెందలేదు. ఆయనకు doctors తో పని లేదు ఆయనకి Hospital ఏ ముఖ్యం అప్పటికి అయన compliants list ఆగలేదు, ఇక్కడ doctors తనని సరిగా చుసుకోవట్లేదు తనని హైదరాబాద్ NIIMS hospital కి తరలించాలి అని పట్టు పట్టారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. అయన అప్పటికి నిరాహార దీక్షలో వుంది 5 రోజులవుతుంది, కాని అయన ఎంతో చలాకి గా active గ తిరగడం మీడియా తో మాట్లాడడం ప్రేక్షకులనే కాదు ఈ సినిమా లో పనిచేసే వారందరిని కూడా ఆశ్చర్యపరిచింది. ఇక చేసేది లేక ఆయన్ని అక్కడికి దగ్గరలో వున్నా గుంటూరు NRI hospital కి తరలించడానికి సన్నాహాలు మొదలయ్యాయి, ఇది నచ్చని మన కామెడీ villain తన అనుచరులతో కలిసి హాస్పిటల్ నుండి పరారయ్యాడు. ఈ పరిణామానికి అయన party లోని అనుచరులు కూడా ఔరా!ఏం జరుగుతుంది ఇక్కడ మాకు తెలియాలి ...తెలియాలి .... అనేలా చేసారు మన రాజగోపాల్. ఇక అక్కడ కనుమరుగైన మన రాజగోపాల్ ఇక్కడ హైదరాబాద్ NIIMS లో ప్రత్యక్షమయ్యారు. అది కూడా మాములుగా కాదు ఒక olympic అథ్లెట్ మాదిరిగా పరుగులు తీసుకుంటూ వచ్చి మరి hospital బెడ్ ఎక్కారు. 7 రోజులుగా దీక్ష చేస్తున్న ఒక మనిషి లో ఇంత చురుకుదనం చూసి అందరు ఆశ్చర్యపోయారు. olympics లో మాదిరి doping టెస్ట్ ఇక్కడ లేదు కాబట్టి మన రాజగోపాల్ ఇంకా గేమ్ లో ఉన్నారు. అప్పటికే చేతికి అందిన తెలంగాణా చేజరిపోయేల చేసాడు అనే ఒక సదాభిప్రాయం తో వున్నా మన తెలంగాణా ప్రజలు ఈ పరిణామానికి ఒక్కసారి ఉవ్వెత్తున లేగిసారు. ఐతే ఇక్కడ మన రాజగోపాల్ ఒక twist ఇచ్చారు. వస్తే వచ్చాడు ఇక ఇకనుండైన దీక్ష ని serious గా కంటిన్యూ చేస్తారు అనుకున్న సీమంధ్ర ప్రేక్షకులకు నాయకులకే కాదు తెలంగాణా లో వున్నా వారిని కూడా ఆశ్చర్యం లో ముంచేస్తూ 24 గంటలు తిరక్కుండానే ఆయన దీక్ష ను విరమించారు. ఐతే ఇక్కడ ఈ situation లో ఏం చెయ్యాలో పాలు పోనీ మన తమిళ director అదే మన చిదంబరం, మళ్ళి సీమంధ్ర నాయకులకు అనుకూలంగా మరి ఒక ప్రకటన చేసారు. ఇదే మన సినిమాలో వచ్చే కీలక మలుపు. బుర్ర వేడెక్కి పోయిందా have a break .....

ఇక్కడే మన సినిమా లో intermission . అదేంటి ఒక కామెడీ villain కి అంత scene ఇచారు అనుకుంటున్నారా ... మీ అనుమానం సరి అయిందే కాని tipical తెలుగు సినిమా లో లా ఇక్కడ కూడా first half లో మన కామెడీ villain గెలిచినట్టు కనబడినా చివర్లో గెలిచేది హీరో ఏ అన్న చిన్న లాజిక్ ని మన రాజగోపాల్ గుర్తించలేక పోయారు. ఐతే ఇక్కడ హీరో మన KCR కాదు మన తెలంగాణా మన తెలంగాణానే ఇక్కడ హీరో. KCR suporting హీరో మాత్రమే ఇది ప్రేక్షకులు గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది.మన సినిమా లో కామెడీ villain ఒక్కడే ఐన comedians మాత్రం ఒక్కొక్క సీన్ లో ఒక్కరు వచ్చి ప్రేక్షకులని అలరిస్తూనే వుంటారు. అల వచ్చిన వాళ్ళలో మొదట మనం మాట్లాడుకోవాల్సింది నట ప్రపూర్ణ(అసంపూర్ణ) మోహన్ బాబు. తెలంగాణా ఎవరి సొత్తు కాదు నవాబుల సొత్తు అని ఏదో సొల్లు మాట చెప్పారు. ఆయనకి తెలంగాణా నవాబులతో పోరాడి తెలంగాణాకి స్వాతంత్రం సంపాయించి పెట్టిన రాజకర్లలో ఎంత మంది సీమంద్రకు చెందినా వారు ఉన్నారు. 1947 లో భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన మన తెలంగాణా కి నిజాం నవాబుల నుండి స్వాతంత్రం రాలేదు. ఈ రోజున మాట్లాడుతున్న అవకాశ వాదులు ఆ రోజున వున్నా మద్రాసు రాష్ట్రం లో వినీలం అవడానికి ఇష్టపడ్డారు కాని ఇంకా బానిసలుగా బతుకుతున్న తెలంగాణా ప్రజల గురించి ఆలోచించలేదు. ఎంతో మంది రజాకార్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి మన తెలంగాణా ని విముక్తి చేయించు కున్నాక, అప్పటికే ఆంగ్ల విద్యనూ బ్రిటిష్ వారి పాలనలో నేర్చుకున్న తమిళులు ఆంధ్ర ప్రజలకు పోటి అని తోచారు, తెలంగాణాలోని ప్రజలు నవాబుల పాలనలో ఆంగ్ల విద్యకు నోచుకోలేదు, తెలంగాణా ప్రజలకు ఆంగ్ల విద్య రాదు కావున తెలంగాణాలో వుండే ఉద్యోగాలు మనకే ఇస్తారు మనమే దోచుకోవచ్చును అనే కుటిల బుద్దితో తెలంగాణాలో కలవడానికి వారు ఉత్సుకత చూపారు. ఈ విషయం తెలీక పాపం మన మోహన్ బాబు గారు నోరు పారేసుకున్నారు. అయన అంతటితో ఊరుకోలేదు అయన ప్రజలకు పిలుపినిచ్చారు ఇంటికి ఒకరు రండి నేను దీక్ష చేపడత నాకు సపోర్ట్ ఇవ్వండి అని, పాపం ఆయన్ని పట్టించుకున్న నాదుడే లేడు. ఐన పూర్వాపరాలు తెలుసుకోకుండా నోటి దురుసు తో మాట్లాడడం మన మోహన్ బాబు గారికి అలవాటే. మీరే చెప్పండి ఈరోజున ఎంత మంది అయన మాట్లాడిన మాటలకు స్పందిస్తున్నారు. ఎవరు పట్టించుకోని స్థాయికి దిగజారిపోయారు. మన ఈ తెలంగాణా ఉద్యమం లో అసువులు బాసిన విద్యార్థులకి ఉద్యమ కారులకి శ్రీ శ్రీ గారి గేయం తో వందనాలు తెలుపుతూ జై తెలంగాణా..!

తల వంచుకు వెళ్ళిపోయావా నేస్తం..!

సెలవంటూ ఈ లోకాన్ని వదిలి.

తలపోసిన వేవీ కొనసాగకపోగా,

పరివేదన బరువు బరువు కాగా,

అటుచూస్తే ఇటుచూస్తే

ఎవరూ చిరునవూ చేయూత ఇవక --

మురికితనం కరుకుతనం

నీ సుకుమారపు హృదయానికి గాయం చేస్తే --

అటుపోతే, ఇటుపోతే అంతా అనాదరనతో,

అలక్ష్యంతో చూసి, ఒక్కణ్ణి చేసి వేధించారని,

బాధించారని వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా, నేస్తం..!

తలవంచుకు వెళ్లి పోయావా నేస్తం..!

......

......

కావున ఈ నిరాశమయ లోకంలో ,

కదనశంఖం పూరిస్తున్నాను:

ఇక్కడ నిలబడి నిన్ను ఇవాళ ఆవాహనం చేస్తున్నాను:

అందుకో ఈ చాచిన హస్తం:

ఆవేశించు నాలో:

ఇలా చూడు నీకోసం ఇదే నా మహాప్రస్థానం: -- శ్రీ శ్రీ